Breaking News

పహల్గామ్‌ దాడి వెనుక ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు: ఎన్‌ఐఏ నిర్థారణ

Published on Fri, 08/29/2025 - 07:20

న్యూఢిల్లీ: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెల్లడించింది. పహల్గామ్‌లోని బేసరన్‌లో జరిగిన దాడికి ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కారణమని నిర్ధారించింది.

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. సరిహద్దుల్లో భారత సైన్యం చేపడుతున్న ఆపరేషన్ మహాదేవ్ నేపధ్యంలో ఎన్‌ఐఏ ఈ ప్రకటన చేసింది. అయితే గతంలో ఈ దాడి వెనుక పలువురు ఉండవచ్చని భావించారు. అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ తన దర్యాప్తులో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడికి కారకులని నిర్థారించింది. బైసరన్‌ పర్యాటక ప్రాంతం కాస్త దూరంలో ఉండటం, పోలీసు ఉనికి  తక్కువగా ఉండటం, పర్యాటకుల రద్దీ అధికంగా ఉండటాన్ని  ఈ ముగ్గురు ఉగ్రవాదులు గమనించారని ఎన్‌ఐఏ భావిస్తోంది.

ఈ ముగ్గురు ఉగ్రవాదులు స్థానికంగా  ఆశ్రయం పొందేందుకు భూగర్భ కార్మికులకు  మూడు వేల రూపాయలు చెల్లించారని ఎన్‌ఐఏ గుర్తించింది. కాగా పహల్గామ్ దర్యాప్తుతో పాటు ఎన్‌ఐఏ అధికారులు మాలేగావ్ పేలుడు కేసు తీర్పును ప్రస్తావించారు. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఫైల్‌ను సమీక్షిస్తున్నారు. తదుపరి చర్యపై నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్‌ఐఏ కోర్టు తీర్పులోని అన్ని అంశాలను పరిశీలిస్తోంది.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)