Breaking News

అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’

Published on Wed, 06/18/2025 - 13:27

గర్హ్వా: మేఘాలయ​కు హనీమూన్‌ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ల కథనం మరువకముందే జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్‌ కేసులో సోనమ్‌ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్‌కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు  అన్నంలో విషం కలిపింది.

జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ  ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ,  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని  తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం  జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)