Breaking News

కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు

Published on Fri, 07/04/2025 - 21:52

పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’  కొత్త మలుపు తిరిగింది.  ఓ డెలివరీ బాయ్‌ తనపై పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్‌ కూడా ఫోన్‌లో టైప్‌ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్‌ అని పోలీసులు తేల్చేశారు.  ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్‌ వచ్చి  అ‍త్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. 

పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.

పూణే పోలీస్‌ కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్‌ బీ బ్యాక్‌( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్‌ చేసింది’ అని చెప్పారు.

మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? 
డెలివరీ బాయ్‌ పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. 

ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!
పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్‌.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్‌ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్‌ తనపై పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది.  ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)