Breaking News

దళితుల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌

Published on Sat, 04/15/2023 - 08:20

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అంబేడ్కర్‌ జపం చేయకపోతే పుట్టగతులు ఉండవని గ్రహించడం వల్లే కేసీఆర్‌ కొత్తగా అంబేడ్కర్‌ నామ స్మరణ మొదలుపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు, విగ్రహం ఏర్పాటు సంతోషమేనని.. కానీ దళితుల­కు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారికి న్యాయం చే­సేది ఎప్పుడని ప్రశ్నించారు. శుక్రవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణభవన్‌లోని ఈటల, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు ఇలా ఏ ఒక్కహామీ అమలు కాలేదని.. దళితుల కళ్లలో కేసీఆర్‌ మట్టి కొట్టారని మండిపడ్డారు. 

దళితుల భూములను లాక్కుంటున్నారు.. 
కేసీఆర్‌ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవున్నాయని ఈటల వ్యాఖ్యానించారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉల్లంఘన అని.. కేబినెట్‌లో ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రిని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మండిపడ్డారు.గత ప్రభుత్వాలు దళితులకు ఇచి్చన భూములను కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. మహనీయుడి విగ్రహం పెట్టినంత మాత్రాన ఎవరూ కేసీఆర్‌కు జేజేలు కొట్టబోరని వ్యాఖ్యానించారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు