Breaking News

Coronavirus: ముంబైలో కేసుల పెరుగుదల.. అదే బాటలో తమిళనాడు, గుజరాత్‌

Published on Fri, 05/23/2025 - 11:42

ముంబై: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌తో సహా ఆసియాలోని కొన్ని దేశాలలో  ​కోవిడ్‌-19(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఈ వివరాలను ఆయా రాష్ట్రాల అధికారులు మీడియాకు వెల్లడించాయి.

మునుపటి వేవ్‌లతో పోలిస్తే మొత్తం కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌(Ahmedabad)తో పాటు పలు నగరాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత మే నెలలో ముంబైలో ఇప్పటివరకూ కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి చూసుకుంటే మహారాష్ట్రలో మొత్తంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 16 మంది  కోవిడ్‌ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుంగా ఉండేందుకు బాధితులను కెమ్‌ ఆస్పత్రి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా  ఒక రిపోర్టులో వెల్లడించింది.

మరోవైపు ముంబై మహా నగరంలో ఇన్ఫ్లుఎంజా(Influenza), శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ముందు జాగ్రత్త చర్యగా పూణేకు చెందిన వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను  ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనావైరస్ యాక్టివ్ కేసులు లేవు. ఇటీవల 87 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ వచ్చిందని, అయితే అతను వైద్య చికిత్సతో కోలుకున్నాడని పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి నీనా బోరాడే తెలిపారు. ఆస్పత్రులలో ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు నీనా తెలిపారు.

తాజాగా తమిళనాడు, గుజరాత్, కేరళలో కొత్తగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. అలాగే పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఇన్ఫ్లుఎంజాకు కారణమైన జ్వరాలు పెరుగుతున్నాయి. ఇవి కరోనా ఇన్ఫెక్షన్‌ అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులను నిర్ధారించగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు వీరి నుంచి శాంపిల్స్‌ను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: సెమికోలన్‌ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)