Breaking News

నాలుగు కాళ్ల దేవతలు!

Published on Wed, 12/03/2025 - 07:23

అది పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, నవద్వీప్‌ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్‌రూమ్‌ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. 

వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసి
వీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్‌ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.

పసికందు చుట్టూ సెంట్రీల్లా..
తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్‌ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

మనుషుల్ని మించిన మానవీయత..
‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.

ఇలాంటి ఘటనే.. 
1996లో కోల్‌కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)