Breaking News

త్వరలో ప్రధాని మోదీతో ఇజ్రాయెల్‌ ప్రధాని భేటీ!

Published on Thu, 12/11/2025 - 19:44

న్యూఢిల్లీ/జెరూసలేం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణలో నెతన్యాహూ, ప్రాంతీయ పరిస్థితులపై మోదీకి వివరాలు అందించారు. 

ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్‌ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్–ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.

నేతన్యాహూ, గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా సవాళ్లపై మోదీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత కీలకమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.  మోదీ-నేతన్యాహూ సంభాషణ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుంది. రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతుందని అంచనా. 
 
ఫోన్ సంభాషణలోనే ఇద్దరు నాయకులు త్వరలో ముఖాముఖి సమావేశం జరపాలని అంగీకరించారు. ఈ సమావేశం ద్వారా పశ్చిమ ఆసియా శాంతి, స్థిరత్వం కోసం కొత్త వ్యూహాలు రూపొందే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్‌ 4,5 తేదీల్లో భారత్‌ పర్యటన చేశారు.  ఈ సందర్భంగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాయి. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు,ప్రధాని మోదీల మధ్య ఫోన్‌ సంభాషణ జరగడం చర్చాంశనీయంగా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)