సరిహద్దు వివాదం.. భారత్‌, నేపాల్ సంబంధాలకు కొత్త సవాల్!

Published on Wed, 06/03/2026 - 07:37

న్యూఢిల్లీ: నేపాల్‌తో తలెత్తిన సరిహద్దు వివాదం పరిష్కారంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్‌ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం పరిష్కారానికి యూకే, చైనాల జోక్యం కోరామంటూ నేపాల్‌ ప్రధాని బాలేన్‌ షా చేసిన ప్రకటనపై ఈ మేరకు స్పందించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన.. ‘భారత్, నేపాల్‌లు సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాదు, 98% మేర సరిహద్దుల డీమార్కేషన్‌ కూడా పూర్తయింది కూడా. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలపై మాత్రమే చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమేనని భారత్‌ మొదటి నుంచీ చెబుతోంది’ అని జైశ్వాల్‌ వివరించారు.

అంతకుముందు.. భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్‌ ప్రధానమంత్రి బాలేన్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రతినిధుల సభ– దిగువ సభ ఈ నెల 8వ తేదీ వరకు, నేషనల్‌ అసెంబ్లీ బుధవారం వరకు వాయిదా పడ్డాయి. భారత్‌ మాత్రమే కాదు, నేపాల్‌ కూడా పలు ప్రాంతాల్లో భారత భూభాగాలను స్వాధీనం చేసుకుంది’ అంటూ ప్రధాని బాలేన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.

ఈ వ్యవహారంపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సలహా తీసుకుని ఒక పరిష్కారం కనుగొంటామని, ఈ విషయంలో చైనా, యూకేల సాయం కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. మంగళవారం దిగువసభలో స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. ప్రధాని బాలేన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్‌ రికార్డుల నుంచి వాటిని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో, స్పీకర్‌ ఈ నెల 8వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)