Breaking News

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్‌ విద్యార్థుల అరెస్ట్‌

Published on Sat, 07/20/2024 - 21:22

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకవకలపై అటు సుప్రీంకోర్టు విచారణ, ఇటు సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

తాజాగా నీట్‌ వ్యవహారంలో కేంద్ర దర్యప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసింది. పేపర్‌ లీక్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ శనివారం అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితులను భరత్‌పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కుమార్ మంగళం బిష్ణోయ్,దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు.

నీట్‌ యూజీ పరీక్ష రోజు హజారీబాగ్‌లో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థి బిష్ణోయ్, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి శర్మ ఉన్నట్లు సాంకేతిక నిఘా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ తంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ దొంగిలించిన పేపర్‌కు ‘పరిష్కారకర్తలుగా’ వ్యవహరిస్తున్నారని తేలిందని పేర్కొన్నారు.

కాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుండి నీట్‌ పేపర్‌ను దొంగిలించాడన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)