Breaking News

‘స్థానికం’లో ప్రతిపక్షాలను తుడిచిపెట్టండి 

Published on Tue, 10/28/2025 - 06:47

ముంబై: త్వరలో మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని బీజేపీ శ్రేణులకు హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. అందరం కష్టించి పనిచేసి, ప్రతిపక్ష పారీ్టల ప్రాతినిథ్యం బూతద్దంతో వెదికినా కనిపించని స్థాయికి తగ్గించాలన్నారు. దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీకి సొంతంగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఊతకర్రలపై ఆధారపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 

‘దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని మనం నిరూపించి చూపాం. పనితీరు, ప్రతిభ ఆధారంగా చేసే రాజకీయాల వల్లే దేశం ప్రగతిబాటన పయనిస్తుంది. ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోదీయే చక్కని ఉదాహరణ’అని అమిత్‌ షా తెలిపారు. నిరుపేద టీ దుకాణం యజమాని ఇంట్లో పుట్టిన మోదీ..అంకితభావం, త్యాగశీలత, కష్టించే తత్వంతోనే భారత ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. 

మోదీ సారథ్యంలో బీజేపీ సైద్ధాంతిక పరమైన హామీలు..ఆరి్టకల్‌ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి వాటిని అమల్లోకి తెచి్చందన్నారు. ఇందులో భాగమైన ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడిక 2047నాటికి వికసిత్‌ భారత్‌ అనే కల సాకారానికి నడుం బిగించిందని అమిత్‌ షా వివరించారు. అనంతరం సీఎం ఫడ్నవీస్‌ మీడియాతో మాట్లాడారు. అమిత్‌ షా చేసిన ఊతకర్రలనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. స్నేహితులను ఊతకర్రలుగా భావించడం లేదన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు అర్థం తెలియని వారికే ఇలాంటి సందేహాలు వస్తాయన్నారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)