Breaking News

ఎన్డీయేకు 324.. ‘ఇండియా’కు 208

Published on Fri, 08/29/2025 - 03:12

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే–సీ వోటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే’లో తేలింది. విపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి కేవలం 208 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 దాకా ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా.. దేశవ్యాప్తంగా వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లో 54,788 మందిని ప్రశ్నించారు. సీవోటర్‌ రెగ్యులర్‌ ట్రాకర్‌ డేటా ద్వారా మరో 1,52,038 మంది అభిప్రాయాలు సేకరించారు.

మొత్తం 2,06,826 మంది వ్యక్తి చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా సర్వే నివేదిక విడుదల చేశారు. దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యమని సర్వే తేల్చింది. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి సొంతంగా 260 సీట్లు, కాంగ్రెస్‌కు సొంతంగా 97 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 44 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు 46.7 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే పేర్కొంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు గాను బీజేపీ కేవల 240 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి 32 సీట్లు తక్కువొచ్చాయి. దాంతో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీయేకు ఇప్పుడు 293 సీట్లున్నాయి. ఇక విపక్ష ఇండియా కూటమి గత ఎన్నికల్లో 234 సీట్లు సాధించింది. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)