Breaking News

మహా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌

Published on Sat, 01/31/2026 - 05:15

ముంబై:  మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్‌ పవార్‌ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె శనివారమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త స్థానంలో సునేత్ర పవార్‌ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం.

 శనివారం ఉదయం ముంబైలో తమ పార్టీ  సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సునేత్ర పవార్‌కు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) అభ్యరి్థగా పోటీ చేశారు. 

కానీ, ఎన్సీపీ(శరద్‌ పవార్‌) అభ్యర్థి సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అనంతరం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలు కాదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉభయ ఎన్సీపీలు ఏకం కాబోతున్నాయని, దీనిపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)