Breaking News

హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

Published on Thu, 10/17/2024 - 10:38

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో  మూడోసారి బీజేపీ సర్కార్‌ కొలువుదీరింది.

 

కంప్యూటర్‌ ఆపరేటర్‌ టు సీఎం..

  • బీజేపీలో కార్యకర్త  స్థాయి నుంచి ఎదిగిన సైనీ
  • 1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరిక
  • మాజీ సీఎం ఖట్టర్‌ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ
  • 2014లో నారాయణ్‌ గఢ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక 
  • మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కేబినెట్‌లో హోంమంత్రిగా సేవలు 
  • 2019లో కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ఎన్నిక
  • 2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం
  • 2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు
  • 200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్‌ విజ​యంలో కీలక పాత్ర
  • పుట్టిన తేదీ: 1970 జనవరి 25
  • సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్‌ మజ్రా గ్రామం
  • బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం

 

  • హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.

     

     

     

     

  • హర్యానా సీఎంగా నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

     

  • హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.

     

  • పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.

  • ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు.  

  • సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు.

  •  ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

     

  • ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్‌ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.

     

     

  •  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)