అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
రికార్డుపై స్పందించిన మోదీ.. వారికే ఇది దక్కుతుంది
Published on Wed, 06/10/2026 - 13:09
ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రజాస్వామ్య భారత్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.. నేపథ్యంలో ఈ రికార్డుపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవివిప్పారు. వినయంతో అంకితభావంతో, కర్తవ్యభావంతో అవిశ్రాంతంగా వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అని అన్నారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు. ఇదివరకూ ఈ రికార్డు దివంగత నేత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది.
ఈ అరుదైన ఘనతపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ "ప్రజా సేవయే సుపరిపాలనకు గొప్ప కొలమానం. వినయంతో, అంకితభావంతో, కర్తవ్య భావంతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. స్వభావరీత్యా భక్తిపరుడై, ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడే అత్యున్నత కీర్తిని పొందుతాడు. వినయశీలి అయిన రాజు నిజంగానే అత్యున్నత కీర్తిని పొందుతాడు." అని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
జవహార్ లాల్ రికార్డును అధిగమించి
జవహార్ లాల్ నెహ్రూ మెుదటగా 1947 నుండి 1952 వరకు ప్రధానిగా ఉన్నారు. అయితే అప్పుడు ప్రజలు నేరుగా ఓటువేసి ఎన్నుకోలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో "సార్వత్రిక వయోజన ఓటుహక్కు" హక్కు కల్పించారు. ఆ తర్వాత జరిగిన సాధారణఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే (1952 మే నుండి 1964 మే లో ఆయన మరణించే వరకు) నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4,398 రోజులు పదవిలో ఉన్నారు. జూన్ 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించారు.
जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।
सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः।
विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs— Narendra Modi (@narendramodi) June 10, 2026
Tags : 1