Breaking News

మహారాష్ట్రలో సంచలనం.. బీజేపీ కూటమిలో చిచ్చు

Published on Sun, 10/25/2026 - 11:10

మహారాష్ట్ర రాజకీయాల్లో రూ.500 కోట్ల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్‌ జరాంగే పాటిల్‌ విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ అధికార కూటమిలో చిచ్చు రేపింది. బీజేపీ నుంచి తనకు రూ.500 కోట్లు శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే ద్వారా అందాయని ఓ మహిళ ఆడియోలో పేర్కొన్నట్లు జరాంగే వెల్లడించారు. దీంతో అధికార కూటమిలోని బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలను ఏక్‌నాథ్‌ షిండే, శ్రీకాంత్‌ షిండే ఖండించారు.

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు రూ.500 కోట్లు శ్రీకాంత్‌ షిండే ద్వారా అందాయంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని జరాంగే గతంలో ఆరోపించారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆడియో క్లిప్‌ను వినిపించారు. అందులో ఓ మహిళ రూ.500 కోట్లను శ్రీకాంత్‌ షిండే ద్వారా జరాంగేకు అందించినట్లు చెబుతున్నారని కథనాలు వెల్లడించాయి. మరాఠ్వాడాలో జరాంగే ప్రభావాన్ని తగ్గించే అంశంపై కూడా కొందరు మాట్లాడుకున్నట్లు సమాచారం.

షిండే ఖండన.. ఫడ్నవీస్‌ విచారణకు ఆదేశం
తనకు కానీ, తన కుమారుడికి కానీ రూ.500 కోట్లు ఇచ్చింది లేదని, తీసుకున్నదీ లేదని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జరాంగేకు సూచించారు. ఆధారాలు ఉంటే సంబంధిత దర్యాప్తు సంస్థలకు అందించాలని కోరారు. మరోవైపు, ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్‌ పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆదేశించారు. ఈ వ్యవహారంపై రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సంభాషణలు ఎందుకు వెలుగులోకి వచ్చాయన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

బీజేపీ, శివసేన నేతల మధ్య ఎదురుదాడి
ఈ వ్యవహారంపై శివసేన నేత, మాజీ మంత్రి రాందాస్‌ కదమ్‌ స్పందిస్తూ.. ఏక్‌నాథ్‌ షిండేను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీలోని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీలు ప్రవీణ్‌ దరేకర్‌, ప్రసాద్‌ లాడ్‌ పేర్లను ప్రస్తావించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. తమ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అయితే, తర్వాత ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు జరిగాయి. శివసేన మంత్రి ఉదయ్‌ సామంత్‌ తనతో మాట్లాడిన అనంతరం ఈ అంశం ముగిసిందని ప్రసాద్‌ లాడ్‌ పేర్కొన్నారు. ఏక్‌నాథ్‌ షిండేను తమ పెద్దన్నగా గౌరవిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మిత్రపక్షాల మధ్య ఇప్పటికే విభేదాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆడియో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు నిజమా, లేక రాజకీయ వివాదంలో భాగమా అన్నది విచారణ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: మాజీ ఐఏఎస్‌ దివ్య సంచలన ప్రకటన.. యూపీలో పొలిటికల్‌ ట్విస్ట్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)