Breaking News

నా భార్య నాగిని!

Published on Wed, 10/08/2025 - 06:27

సీతాపూర్‌ (యూపీ): అక్టోబర్‌ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్‌ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ అభి షేక్‌ ఆనంద్‌ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్‌ తహ సీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్‌ కూడా కలెక్టర్‌ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్‌ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.

‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్‌.. స్‌. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్‌ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్‌ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్‌... స్‌... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్‌ బావురు మన్నాడు.

పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్‌ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్‌ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)