Breaking News

సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!

Published on Sat, 10/19/2024 - 05:11

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్‌ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్‌పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్‌ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్‌ను ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు.

ఆ సీట్లనే కోరుతున్న శివసేన
విదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్‌ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్‌ పవార్‌ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్‌ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్‌ వైపు నిలిచారు. 

ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్‌ వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22,  బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్‌ ఐదు సీట్లు గెలుచుకుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)