Breaking News

మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..

Published on Mon, 06/26/2023 - 17:57

ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. కందివాలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈశాన్య రుతుపవనాలతో ముంబయిలో వర్షాలు కుండపోతగా కురిశాయి. దీంతో డ్రైనేజీల్లో వర్షపు నీరు పొంగి పారుతోంది. దీంతో చాలాచోట్ల డ్రైనేజీల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగి చెత్తను అందిస్తుండగా.. మరో వ్యక్తి దానిని దూరంగా పారబోస్తున్నాడు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తి కిందికి వంగాడు. అది గమనించని కారు డ్రైవర్‌.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు. 

ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని మ్యాన్‌హోల్‌ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కార్మికున్ని గమనించని కారు డ్రైవర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు..

      

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)