మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్‌.. పోయేదేముంది?

Published on Tue, 08/04/2026 - 18:56

ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్‌లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 

దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్‌తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య భుజ్‌బల్ అనే యూజర్‌ షేర్‌ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.

వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్‌డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.

వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్‌టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్‌ పేర్కొన్నారు. "భీమ్‌రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)