Breaking News

ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

Published on Sat, 08/16/2025 - 08:51

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు(శనివారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
 

భారీ వర్షాల కారణంగా విఖ్రోలి వెస్ట్‌ సమీపంలోని కొండచరియలు విరిగిపడగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీచేసినందున ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు.

‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందనే రిపోర్టులు వస్తున్నాయి.  బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ముంబై పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని ముంబై పోలీసులు ‘ఎక్స్‌’లో తెలిపారు.

భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్‌లలో భారీ వర్షాలు కురియనున్నాయని హెచ్చిరించింది. పాల్ఘర్‌లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా భారీ వర్షాల కారణంగా నగరంలోని వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా, చెంబూర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.

రైల్వే ట్రాక్‌లు నీటితో నిండిపోయాయి. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది.
కాగా గురువారం ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ కొలాబా అబ్జర్వేటరీ వద్ద 53 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)