Breaking News

మోదీ విదేశీ పర్యటన.. విమానానికి బెదిరింపులు..

Published on Wed, 02/12/2025 - 11:30

ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉ‍గ్ర బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్‌ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్‌ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ‍ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్‌ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్‌ అయ్యారు. అనంతరం, ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్‌లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్‌ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)