కర్ణాటకలో ‘ముడా’ ప్రకంపనలు.. ఖర్గే కీలక నిర్ణయం!

Published on Sun, 10/13/2024 - 18:30

బెంగళూరు: గత కొంత కాలంగా మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం..  బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసింది. 

అయితే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సిద్ధార్థ విహార్‌ ట్రస్టుకు కేటాయించగా.. మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు. 

ఇక.. ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తమ   ట్రస్టుకు కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి తిరిగి  ఇచ్చేయాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)