Breaking News

‘జీ-20కి భారత్ ఆతిథ్యం.. టాప్‌ 20 ఉగ్రవాదులకు పాక్‌ ఆతిథ్యం’

Published on Mon, 06/02/2025 - 13:35

లండన్‌: దాయాది దేశం పాకిస్తాన్‌పై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది విరుచుకుపడ్డారు. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే పొరుగు దేశం పాకిస్తాన్‌ మాత్రం టాప్‌ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ బుద్ధి ఎలాంటి అంటే.. మనం వారితో కరచాలనం చేసి ఇటు వైపు తిరిగిన వెంటనే.. మన వెనుక నుంచి దాడి చేస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై వివరణ, పాక్‌ దౌత్యపరంగా దెబ్బతీసేందుకు అఖిలపక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్‌కు చేరుకుంది. ఈ అఖిలపక్ష బృందంలో శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సభ్యులుగా ఉన్నారు. తాజాగా లండన్‌లో ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే.. పాకిస్తాన్‌ మాత్రం టాప్‌ 20(టీ20) ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇదీ వారి విధానం. జీ-20 అధ్యక్ష పదవిలో భారత్‌ ఒక ఏడాది పాటు కొనసాగింది. ఈ సమయంలో అధ్యక్ష పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాం.

ఇదే సమయంలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక మాట్లాడుతూ.. బిన్‌ లాడెన్‌ గురించి ఇక్కడున్న వారిలో ఎంత మందికి తెలుసు. మీలో ఎంత మంది లాడెన్‌ డాక్యుమెంటరీ చూశారో నాకు తెలియదు. ఒక్కసారి లాడెన్‌ డాక్యుమెంటరీ చూడండి.  పాకిస్తాన్‌ ఎంత సాయం చేసిందో తెలుస్తుంది. అల్‌ ఖైదాకు నిధులు ఇచ్చారు.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలో జరిగిన దాడుల సూత్రధారి లాడెన్‌. ఈ దాడి తర్వాత లాడెన్‌ పాకిస్తాన్‌లో దాక్కున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)