ఆ ఒక్క మాటే తీర్పును తిరగరాసింది!

Published on Sat, 07/04/2026 - 11:37

భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య నోరు జారింది. భర్త తట్టుకోలేకపోయాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా రాయి తీసుకుని దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో చేసిన నేరానికి వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ, సమాజం ఊరుకోలేదు!. కోర్టు జీవితఖైదు విధించి తన పని తాను చేసింది. అయితే ఒక్క మాటతో ఆ తీర్పును ఇప్పుడు తిరగరాయాల్సి వచ్చింది.

ఐదేళ్ల కిందట.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన గర్భిణీ హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మాటామాటా పెరిగి కిరణ్‌ అనే మహిళను ఆమె భర్త శివ రాళ్లతో దాడి చేసి చంపాడు. ఆపై విషయాన్ని ఇరు వైపులా కుటుంబాలకు తెలియజేశాడు. అయితే.. ఆమె కడుపుతో ఉండడం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు విధించింది. అయితే..

ఈ శిక్ష పునఃపరిశీలన కోసం తాజాగా ఈ కేసు మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. నిందితుడి జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా మార్చేసింది. కేసు విచారణలో కీలకంగా మారిన అంశం.. గొడవ సమయంలో భార్య చేసిన ఒక వ్యాఖ్య. 

కిరణ్ తన భర్తను ఉద్దేశించి “నువ్వు కాకపోతే.. నీలాంటి వందల మంది నాకు మొగుళ్లుగా దొరుకుతారు” అని అన్నదట. ఈ మాట తనలో తీవ్ర ఆవేశాన్ని రేపిందని, అదే ఆవేశంలో రాయితో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని శివ కోర్టుకు తెలిపాడు. ఆధారాలను, వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్‌ వివేక్ అగర్వాల్, జస్టిస్‌ అవినీంద్ర కుమార్ సింగ్.. Grave and sudden provocationను పరిగణనలోకి తీసుకున్నారు.

ఇది క్షణికావేశంలో జరిగిన నేరంగా భావించిన ధర్మాసనం..  దాడి జరిగిన వెంటనే నిందితుడు స్వయంగా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. “అది ప్రణాళికాబద్ధ(ప్లాన్‌ప్రకారం చేసిన) హత్య కాదు. కోపంలో జరిగింది అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 1 వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల హత్యగా కాకుండా ‘కల్పబుల్ హోమిసైడ్’ (Section 304 Part II) కింద కేసును పరిగణించింది. జీవితఖైదును కాస్త.. ఏడేళ్ల శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.

Grave and sudden provocation (IPC సెక్షన్ 300 Exception 1).. దీని ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అవమానం లేదంటే తీవ్ర ఆవేశాన్ని రేపే మాట/పరిస్థితిని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు.. నియంత్రణ కోల్పోయి నేరం చేయడం.. 

అయితే మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మాటల ప్రభావం, గృహహింస కేసుల్లో భావోద్వేగ ప్రేరణ పాత్ర వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయపరమైన సడలింపు సరైన దేనా? అనే ప్రశ్నలు వస్తుండగా, మరోవైపు భావోద్వేగ ఆవేశంలో జరిగే నేరాలపై చట్టం ఎలా స్పందించాలన్నదానిపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)