Breaking News

కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి

Published on Sat, 04/12/2025 - 12:04

తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్‌ కుమార్‌ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్‌ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.

తిరువోణం సమీపంలోని కాళయరాయన్‌ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్‌లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్‌ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)