గుజరాత్ వరదల్లో కొట్టుకుపోయిన వందల సిలిండర్లు 

Published on Mon, 07/24/2023 - 16:59

గాంధీనగర్: గుజ‌రాత్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా వర్ష ఉధృతి తగ్గకపోవడంతో ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక జునాగఢ్ జిల్లాలో అయితే భారీ సంఖ్యలో పార్కింగ్ కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో నుండి వందలకొద్దీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.   

అసలే ఆకాశాన్నంటిన ధర కారణంగా గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క సామాన్యుడి గోడు ఇలా ఉంటే మరోపక్క గుజరాత్ లో వర్షాల కారణంగా న‌వ‌స‌రి ప‌ట్ట‌ణం జునాత‌నా ప్రాంతంలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ నుండి వందల కొద్దీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోతూ కనిపించాయి. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి విశేష స్పందన లభించింది. 

మిగతా వారి సంగతెలా ఉన్నా కానీ సామాన్యులు మాత్రం సిలిండర్లు వరద ప్రవాహంలో పోతుంటే వాటి విలువ తెలిస్తే అంత నిర్లక్ష్యంగా వాటిని కొట్టుకుపోనిచ్చేవారు కాదని వాపోతున్నారు. 

ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)