Breaking News

కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం

Published on Wed, 08/27/2025 - 13:08

మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్‌ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. 

ఉత్తర ప్రదేశ్‌ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్‌ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్‌ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్‌లో వచ్చారు. రోహితాష్‌ లాయర్‌తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్‌ సైకిల్ ట్రంక్‌ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. 

ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్‌లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చివరికి, రోహితాష్‌ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్‌ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్‌ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)