Breaking News

ఢిల్లీ ఎంట్రీ పాయింట్లను పర్యవేక్షించండి: సుప్రీంకోర్టు

Published on Fri, 11/22/2024 - 16:11

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌(గ్రాప్‌)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్‌ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్‌ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.

ఇక జీఆర్‌ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్‌జీ, భారత్‌–6 ప్రమాణాల డీజిల్‌ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్‌సీఆర్‌ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. 

ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌ జిల్లాల్లో భారత్‌–3, భారత్‌–4 ప్రమాణాల డీజిల్‌ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది.  ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్‌లైన్‌లో చేపట్టాల్సి ఉంటుంది.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)