Breaking News

అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా

Published on Wed, 02/12/2025 - 11:57

కుంభమేళాకు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా తన అందమైన తేనెకళ్ల కారణంగా రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది. ఒక్కదెబ్బతో ఈమె ఖాతాలోకి లెక్కలేనంతమంది అభిమానులు చేరిపోయారు. ఇదే నేపధ్యంలో మోనాలిసా ఒక సినిమా అవకాశాన్ని, ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నిరక్షరాస్యురాలైన మోనాలిసా ఇప్పుడు అక్షరాలు దిద్దేపనిలో పడింది.  

ఇంటర్నెట్‌ సస్సేషన్‌గా మారిన మోనాలిసా ఏనాడూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అయితే ఇప్పుడు ఆమెకు చదువు అవసరం ఏర్పడింది. దీనిని గుర్తించిన దర్శకుడు సనోజ్‌ మిశ్రా ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల ఆయన షేర్‌ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మోనాలిసా హిందీలో అక్షరాలు దిద్దుతున్నట్లు కనిపిస్తోంది. స్లేట్‌ పెన్సిల్‌ తీసుకుని, మోనాలిసా అక్షరాలు దిద్దటాన్ని మనం ఆ వీడియోలో చూడవచ్చు.

ఎవరూ ఊహించని విధంగా మోనాలిసా జీవితం మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే, మరోవైపు అక్షర జ్ఞానాన్ని కూడా మోనాలిసా పెంపొందించుకుంటోంది. ఆమె నటిస్తున్న చిత్రం ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానున్నదని సమాచారం. 

ఇది కూడా చదవండి: రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)