Breaking News

ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ

Published on Thu, 05/29/2025 - 11:34

న్యూఢిల్లీ: ‘పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడి, భారతీయులను విభజించాలని కోరుకున్న ముష్కరులకు భారత్‌ తగిన సమాధానం ఇచ్చిందని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని అన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసింది కేవలం భారతీయులపై దాడి మాత్రమే కాదు. ఇది మానవత్వంపై జరిగిన దాడి. మన సోదర స్ఫూర్తిపై దాడి. అయితే ఆపరేషన్ సిందూర్ ద్వారా  మనం వారికి బలమైన ప్రతిస్పందన చూపామని ప్రధాని మోదీ బాగ్డోగ్రాలో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

నేడు (గురువారం) జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సిక్కిం పర్యటన ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని హాజరుకావలసి ఉంది. దీనిలో భాగంగా ఆయన గ్యాంగ్‌టక్‌ చేరుకుని, రూ. 750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించని కారణంగా రద్దయ్యాయి. దీంతో ప్రధాని మోదీ బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్‌) నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సిక్కిం ప్రజాస్వామ్య ప్రయాణంలో స్వర్ణోత్సవం అని అన్నారు. తాను రాష్ట్ర ప్రజల  సమక్షంలో ఉంటూ, 50 వసంతాల విజయవంతమైన ప్రయాణాన్ని చూడాలనుకున్నానని, అయితే ఢిల్లీ నుండి బాగ్డోగ్రా చేరుకోగానే, అక్కడి వాతావరణం తనను మరింత ముందుకు వెళ్లకుండా ఆపివేసిందని, ఫలితంగా  సిక్కిం ప్రజలను వ్యక్తిగతంగా కలిసే అవకాశం దక్కలేదని ప్రధాని మోదీ ‍పేర్కొన్నారు.

సిక్కిం 50వ వార్షికోత్సవ  వేడుకల కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మలచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృష్టిచేశారని ప్రధాని అన్నారు. సిక్కిం 50వ వార్షికోత్సవం సందర్భంగా  రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. 50  ఏళ్ల క్రితం సిక్కిం తనకు తానుగా ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించుకుందని, నాడు సిక్కిం(Sikkim) ప్రజలు భారతదేశంతో కనెక్ట్ కావాలని కోరుకున్నారన్నారు. ఈ రోజు సిక్కింలోని ప్రతి కుటుంబం  అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. 50 ఏళ్లలో సిక్కిం 100శాతం సేంద్రీయ రాష్ట్రంగా మారిందని, సంస్కృతి, వారసత్వ సంపదకు చిహ్నంగా ఉద్భవించిందని ప్రధాని అన్నారు.

2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని చెప్పామని, ఈ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా  మార్చిందని మోదీ పేర్కొన్నారు. నేడు సిక్కిం అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని, ఇది నవ భారత అభివృద్ధిలో ఒక  కొత్త అధ్యాయంగా మారనున్నదని ప్రధాని మోదీ అన్నారు.

ఇది  కూడా చదవండి: నేటి నుంచి ఆ రాష్ట్రాల్లో ‍ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)