Breaking News

మోదీపై ప్రశంస.. రాజీనామా చేయాలంటూ డిమాండ్‌!

Published on Tue, 12/05/2023 - 09:37

పట్నా: రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌.. ఈ మూడు రాష్ట్రాల్లో​ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో తాము మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా దళ్‌ యునైటెట్‌(జేడీయూ)చెందిన లోక్‌సభ ఎంపీ సునీల్‌ కుమార్‌ పింటూ.. మోదీని ప్రశంసిస్తూ చేసిన స్లోగన్‌ వివాదాస్పదంగా మారింది. 

ఆయా రాష్ట్రాల ఎన్నికల  ఫలితాల అనంతరం ‘గెలుపు మోదీతో సాధ్యమవుతుంది’అనే బీజేపీ నేతలు, కార్యకర్తలు పలికే స్లోగన్‌ను ఆయన కూడా అంటూ మోదీని ప్రశంసించారు. దీంతో జేడియూ పార్టీ నేతలు పింటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా ప్రశంసలు కురిపించినందుకు పింటూ.. లోక్‌ సభ సత్వాని​కి రాజీనామా చేయాలని జేడియూ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. పింటూ మోదీ పట్ల ప్రభావితం అయ్యారని అగ్రహించారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీజేపీ, మోదీకి అనుకూలమైన స్లోగన్‌లు చేయటం సరికాదన్నారు . అతి తర్వరలో లోక్‌సభ సభ్యత్వ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే పింటూ చేసిన మోదీ అనుకూల స్లోగన్‌పై బీజేపీ అధికార ప్రతినిధి కుంతల్‌ కృష్ణా స్పందిస్తూ..  పింటూ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని తెలిపారు. 

గతేడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తర్వాత ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

ఇదికూడా చదవండి: ‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)