Breaking News

Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం

Published on Tue, 05/20/2025 - 09:14

లుమ్‌ష్నాంగ్‌: మేఘాలయలోని లుమ్‌ష్నాంగ్‌లో  ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించి, సుమారు 15 ట్రక్కులను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు.

వివరాల్లోకి వెళితే ఈ ఘటన జైంటియా హిల్స్ జిల్లాలోని వహియాజెర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి  ఎన్‌హెచ్‌-6పై జరిగింది. తొలుత ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఒక పికప్ వాహనాన్ని ఢీకొంది. ఈ దరిమిలా ఆగ్రహించిన పికప్ వాహనం డ్రైవర్.. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌పై  దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సిమెంట్ ట్రక్కు డ్రైవర్ వేగంగా డ్రైవ్ చేస్తూ, పికప్ వాహనం డ్రైవర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సిమెంట్ ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు ఆయుధాలు చేతపట్టి సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించారు. సెంట్రీ పోస్ట్‌తో పాటు సీసీటీవీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగక  15 ట్రక్కులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. జైంటియా హిల్స్ జిల్లా పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హింసాత్మక  ఉదంతానికి సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటన నేపధ్యంలో లుమ్‌ష్నాంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. 

ఇది కూడా చదవండి: గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్‌, కెనడా హెచ్చరిక

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)