Breaking News

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ వచ్చేనా?

Published on Mon, 08/05/2024 - 07:14

ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.  

మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్ట్‌ చేశాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్‌ ఇవ్వాలని గతంలోనే కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ముఖ్యపాత్ర పోషించారని, బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐలు తమ వాదనల్ని వినిపించాయి. అందుకు తగిన ఆధారాల్ని కోర్టు ముందుంచాయి. దీంతో ట్రయల్‌ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.  

అయితే ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్‌ కోర్టులోనే మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై  జూలై 22న ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కేసును సోమవారానికి (ఆగస్టు 5)కి వాయిదా వేశారు. ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తీవ్ర ఉ‍త్కంఠంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)