Breaking News

తమిళ రాజకీయాల్లో భూకంపం.. తలుపులు మూసేసిన డీఎంకే

Published on Sun, 07/12/2026 - 16:09

చెన్నై: తమిళనాడులో ఇండియా కూటమిలో పెరుగుతున్న విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన విజ్ఞప్తిని డీఎంకే గట్టిగా తిరస్కరించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కలిసి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’లో చేరి బీజేపీని ఎదుర్కోవాలని వీసీకే కోరింది.

తాజా వివాదానికి కారణం వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ చేసిన ప్రతిపాదన. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, డీఎంకే ఈ సూచనను తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి ద్రోహం చేసిందని ఆరోపించింది.

డీఎంకేకు వెన్నుపోటు! 
డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు దక్కించుకోవడానికే టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇండియా కూటమి విస్తృత ప్రయోజనాల కోణంలో కాంగ్రెస్ పరిస్థితిని చూడలేదని, ఇప్పుడు డీఎంకేను ఒప్పించేందుకు వీసీకేను "దూత"గా ఉపయోగిస్తోందని చెప్పారు. 

"వీసీకే ప్రతిపాదనను డీఎంకే నాయకత్వం అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ మోడల్‌ తమిళనాడులో పని చేయదు" అని ఆయన అన్నారు. టీవీకే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. 

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రంలో ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయని వివరించారు. తమిళనాడులో మాత్రం అధికారంలో ఉన్న కొత్త రాజకీయ శక్తి రంగంలోకి వచ్చిందని తెలిపారు.

పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపై కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతైన ఆలోచన అవసరమని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ప్రయత్నం చేస్తుండడంతో బీజేపీనే డీఎంకేకు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)