Breaking News

‘మా కొడుకు ఎక్కడ?..’ ప్రధాని మోదీకి అభ్యర్థన

Published on Mon, 03/04/2024 - 11:39

భారత నౌకా దళానికి చెందిన సాహిల్ వర్మ ఈ  ఫిబ్రవరి 27 నుంచి ఆదృశ్యం అయ్యారు. ఆయన ఆచూకీ కోసం భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.  ఈ నేపథ్యంలో తమ కొడుకు ఆచూకీ ఇంకా తెలియకపోవటంపై సాహిల్ వర్మ తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయంలో  ప్రధానమంత్రి, సీబీఐ, రక్షణ శాఖమంత్రి, హోం శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌గవర్నర్‌ మనోజ్‌ సన్హా జోక్యం చేసుకొని తన కుమారుడిని క్షేమంగా వెతికి తీసుకురావాలని కోరుతున్నారు. సాహిల్‌ తల్లిదండ్రులు జమ్ములోని గౌ మన్హాసన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ‘మా కుమారుడు ఎక్కడ ఉన్నాడు’ అంటూ సాహిల్‌ వర్మ తల్లిదండ్రులు సుభాష్‌ చందర్‌, రామా కుమారి కన్నీరుమున్నీరవుతున్నారు. 

‘మేము ఫిబ్రవరి 29న మా కుమారుడు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడనే సమాచారాన్ని ఫోన్‌ కాల్‌ ద్వారా తెలుకున్నాం. మేము సాహిల్‌ వర్మతో ఫిబ్రవరి 25న చివరిసారి మాట్లాడాము’ అని సాహిల్‌ తండ్రి  సుభాష్‌ చందర్‌ తెలిపారు. తమ కుమారుడి ఆచూకీని తొందరగా తెలుసుకోని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. డ్యూటీలో ఉండగా అదృశ్యమైన తమ కుమారుడి కేసును సీబీఐకీ అప్పగించాలన్నారు. 400 మంది నౌకలో  ఉండగా తమ కుమారుడు మాత్రమే అదృశ్యమయ్యాడని అనుమానం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 27 నుంచి సాహిల్ వర్మ (సీమ్యాన్-2) కనిపించకుండా పోవడం దురదృష్టకరమని భారత నేవీకి చెందిన వెస్ట్రన్ కమాండ్  వెల్లడించింది. సాహిల్‌ భారత నేవీ షిప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. సాహిల్ వర్మ ఆచూకీ తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి బోర్డును ఏర్పాటు చేసినట్లు వెస్ట్రన్ కమాండ్ పేర్కొం‍ది. ఈ ఘటనపై విచారణకు బోర్డును ఆదేశించింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)