Breaking News

పాక్‌ కుయుక్తులు.. భారత్‌ సీరియస్‌ వార్నింగ్‌

Published on Thu, 05/08/2025 - 18:13

ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్‌ టార్గెట్‌ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాకిస్థాన్‌ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని..  ఉగ్రవాద శిబిరాలపై  మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్‌ దాడులను తిప్పికొట్టామని.. పాక్‌ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.

నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి,భుజ్‌లో పాక్‌ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.

నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై  మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్‌ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో పాక్‌ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్‌ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్‌ మిస్త్రీ అన్నారు.

‘‘పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే  పాకిస్థాన్‌ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్‌ఎఫ్‌.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్‌ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.

బిన్‌ లాడెన్‌కు కూడా పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్‌ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్‌, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో  పాక్‌ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్‌ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్‌ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్‌ కాల్పులు జరిపింది. పాక్‌ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్‌ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్‌ మిస్త్రీ చెప్పారు.

 

 

 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)