Breaking News

యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం 

Published on Thu, 07/06/2023 - 13:03

న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. 

మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. 

ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. 

ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. 

ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు.      

ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి.  

ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)