Breaking News

సంపద కొందరి వద్దే.. పేదల సంగతేంటి?: గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 07/06/2025 - 07:29

ముంబై: దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటిది జరగరాదంటే సంపద వికేంద్రీకృతం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పారు.

నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి గడ్కరీ వివిధ సామాజిక అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారేగాని, సంపద కేంద్రీకరణను ఆపే చర్యలను మాత్రం తీసుకోలేదని గడ్కరీ తెలిపారు. జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 22–24 శాతం, సేవా రంగం 52–54 శాతం వాటా కాగా, గ్రామీణ జనాభాలోని 65–70 శాతం మంది పాల్గొనే వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతం మాత్రమేనని ఆయన వివరించారు.

ఈ అసమతుల్యతను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ఆర్థిక రంగానికి చార్టెర్డ్‌ అకౌంటెంట్ల అవసరం ఎంతో ఉందని, వారు చోదకశక్తుల వంటివారని అభివర్ణించారు. రోడ్ల నిర్మాణం కోసం బీవోటీ(బిల్డ్‌–ఆపరేట్‌–ట్రాన్స్‌ఫర్‌)విధానాన్ని అమల్లోకి తెచ్చిన వారిలో తానూ ఉన్నానంటూ గడ్కరీ..ఇప్పుడిక రోడ్ల అభివృద్ధికి నిధుల కొరతనేదే లేదని వివరించారు. ప్రస్తుతం టోల్‌ ప్లాజాల నుంచి ఏడాదికి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే రెండేళ్లలో ఇది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందన్నారు.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)