Breaking News

మోదీ కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్‌ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్‌

Published on Fri, 09/27/2024 - 08:18

ముంబై: కేందమంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన కామెంట్స్‌ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ముందు, తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్‌ వచ్చినట్టు గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాలు తనకు మద్దుతు ఇస్తామని చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

నితిన్‌ గడ్కరీ తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మోదీ బదులు ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ముందుకు రావాల‌ని, తాము మ‌ద్ద‌తు ఇస్తామంటూ ప్రతిప‌క్షాల నుంచి నాకు ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత కూడా అలాంటి ప్ర‌తిపాద‌న‌లు వచ్చాయి. కానీ, నేను వారి ఆఫర్‌ను తిరిస్కరించాను. మోదీ బదులుగా నేను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అనేది బీజేపీలో చీలిక కోసం ప్రతిపక్షాలు చేసిన ప్లాన్‌ అని నేను అనుకుంటున్నాను.

మోదీ పాలనలో నేను నా బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నాకు ప్రధాని కావాలనే కోరిక ఏమీ లేదు. ఆ పదవి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కూడా లేదు. మొదట నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిని, బీజేపీ కార్యకర్తను. నాకు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నాకు ఒక్కటే. నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేసుకుంటాను అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుత బీజేపీలో 75 సంవ‌త్స‌రాలు నిండిన వారు కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు కూడా అన‌ర్హులు అన్న‌ట్టుగా రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ఇస్తూ సీనియర్లకు బయటకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వయస్సు 74 సంవత్సరాలు కాగా.. ఆయనకు ఈ నియమం వర్తిస్తుందో లేదో తెలియదు. ప్ర‌స్తుతం గ‌డ్క‌రీ వ‌య‌సు 67 సంవ‌త్స‌రాలు కావడంతో గడ్కరీ ప్రధాని స్థానం ఇవ్వాలని పలువురు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు కోరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: మహాలక్ష్మి కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)