Breaking News

ముంబై బీఎండబ్ల్యూ కేసు: నిందితుడు మిహిర్ షా పశ్చాత్తాపం!

Published on Thu, 07/11/2024 - 15:03

ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రధాన నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్‌ రాజశ్రీ బిదావత్‌తో పోలీసులు బుధవారం రాత్రి ప్రమాధ ఘటన సీన్‌  రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అయితే వారు వేగంగా కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత  తమకారు మృతి చెందిన మహిళను కొంత దూరం  ఈడ్చుకువెళ్లినట్లు తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

ఘటనాస్థలంలో నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్‌ రాజశ్రీ బిదావత్‌ తాము చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పుకు మిహిర్‌ షా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మిహిర్ షా, డ్రైవర్‌ రాజశ్రీ బిదావత్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్లపై పూర్తి నమ్మకం లేదని, వారి వాంగ్మూలంపై పరిశీలన చేస్తున్నామని పోలసులు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్‌ షాకు జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.

కాగా జులై 7న (ఆదివారం తెల్ల‌వారుజామున‌) మ‌ద్యం మ‌త్తులో మిహిర్ షా బీఎండ‌బ్ల్యూ కారుతో ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్ట‌డంతో 45 ఏళ్ల మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆమె భ‌ర్త గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మిహిర్ షా ప‌రారీలో ఉన్నాడు. దాదాపు 72 గంట‌ల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మ‌రోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ స‌స్పెండ్ చేసింది. ఇక ప్ర‌మాదం త‌ర్వాత మిహిర్ త‌న ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మ‌హిళ‌ను కారుతో గుద్ది చంపిన త‌ర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని  పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)