Breaking News

ఎయిరిండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్ డోర్‌ తెరిచేందుకు యత్నించి..

Published on Mon, 09/22/2025 - 15:37

బెంగళూరు: ఎయిరిండియా(Air India) విమానంలో కలకలం రేగింది. కాక్‌పిట్ డోర్(Cockpit Door)  తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్‌ అవుతుందన్న భయంతో పైలట్‌ డోర్‌ తెరవలేదు. పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఎయిరిండియా(IX-1086) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. భద్రత పరంగా కాక్‌పిట్ డోర్‌ను తెరవాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, కెప్టెన్ అనుమతిస్తేనే ప్రవేశం సాధ్యమవుతుంది. ఆ ప్రయాణికుడు డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

అయితే, ఆ ప్రయాణికులు ఎందుకు కాక్‌పిట్‌ను తెరవడానికి ప్రయత్నించాడో ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. వారిని విమానం వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్(Central Industrial Security Force) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిరిండియా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఎయిరిండియా ఘటన: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)