Breaking News

నిర్మలా సీతారామన్‌ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర!

Published on Fri, 06/09/2023 - 11:55

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్‌లో వాంగ్మయి, ప్రతీక్‌ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్‌ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. 

ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్‌ లాంజ్స్‌ బుక్స్‌ అండ్‌ కల్చర్‌ సెక్షన్‌లో ఫీచర్‌ రైటర్‌గా పని చేస్తున్నారు.  ఇక గుజరాత్‌కు చెందిన  ప్రతీక్‌ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్‌ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్‌ ప్రయాణం కొనసాగడం ద్వారా.

► గుజరాతీ అయిన ప్రతీక్‌ దోషి.. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా ప్రతీక్‌ పని చేశాడు.

► అటుపై  2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్‌ సెక్రటరీ ర్యాంక్‌ దక్కింది.  

► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్‌ అండ్‌ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంది. 

► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్‌. 

► ప్రతీక్‌.. పెద్దగా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. 

► వాంగ్మయి-ప్రతీక్‌ల వివాహం బెంగళూరులోని టమరిండ్‌ ట్రీ హోటల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

::: సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)