Breaking News

పాతికేళ్లకే యంగెస్ట్‌ బిలియనీర్‌.. అమన్‌ అంటే అమేయ ప్రతిభ

Published on Fri, 11/28/2025 - 09:39

యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌... వైబ్‌ కోడింగ్‌. వైబ్‌ కోడింగ్‌ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో కోడ్‌ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వైబ్‌ కోడింగ్‌కు సంబంధించి ఏఐ టూల్‌ ‘కర్సర్‌’ను రూ పొందించి ప్రపంచ దృష్టిని  ఆకర్షించిన అమన్‌ సాంగర్‌ పాతికేళ్ల వయసులోనే బిలియనీర్‌ అయ్యాడు...కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్‌లలో అమన్‌ సాంగర్‌ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్‌ ఏఐ ఇన్నోవేషన్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిధ్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.

జనరేటివ్‌ ఏఐ ప్రపంచంలో ‘అమన్‌ సాంగర్‌’ అనేది సుపరిచిత పేరుగా మారింది. ‘ఎనీస్పీయర్‌’ సహ–వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్‌ ఒకరు. ఫాస్ట్‌–రైజింగ్‌ ఏఐ టూల్‌గా పేరు తెచ్చుకున్న ‘కర్సర్‌’ అనేది ఎనీస్పీయర్‌ కంపెనీ సృష్టి. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో తనకు పరిచయం అయిన మైఖేల్‌ ట్రుయేల్, సుయాలే, ఆర్విడ్‌ మార్క్‌లతో కలిసి ‘ఎనీస్పీయర్‌’ ్ర΄ారంభించాడు అమన్‌. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్‌గా ‘ఎనీస్పీయర్‌’ పేరు తెచ్చుకుంది. అమన్, మైఖేల్‌ ట్రుయెల్‌లు ‘నియో స్కాలర్స్‌’గా ఎంపికయ్యారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతరాన్ని సిలికాన్‌ వ్యాలీలోని ఫౌండర్స్, ఇన్వెస్టర్‌లకు పరిచయం చేసే కార్యక్రమమే...నియో స్కాలర్స్‌.


ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్‌ రౌండ్‌ ఫండింగ్‌ సాఫీగా సాగింది. మొదట్లో ‘ఎనీస్పీయర్‌’ బృందం కంప్యూటర్‌–ఎయిడెడ్‌ డిజైన్‌కు సంబంధించి ఏఐ టూల్‌ను రూపొందించింది. ఆ తరువాత దారి మార్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ వైపు అడుగులు వేసింది. ఇది తాము కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన డొమైన్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ వైపు రావాలని తీసుకున్న నిర్ణయమే ‘కర్సర్‌’ను రూపొందించడానికి కారణం అయింది. ఈ ఏఐ–పవర్డ్‌ కోడ్‌ ఎడిటర్‌ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘వైబ్‌ కోడింగ్‌’ అనే ఐడియాను పరిచయం చేసింది కర్సర్‌.వైబ్‌ కోడింగ్‌ ద్వారా డెవలపర్స్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ని ఉపయోగించి కోడ్‌కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్‌ చేయవచ్చు. కాలిన్స్‌ డిక్షనరీ వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘వైబ్‌ కోడింగ్‌’ ఎంపికైంది. తక్కువ టైమ్‌లోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ‘ఎనీస్పీయర్‌’ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో–ఫౌండర్స్‌ బిలియనీర్‌లుగా మారారు. పద్నాలుగేళ్ల వయసులోనే కోడింగ్‌ మొదలుపెట్టాడు అమన్‌. ్ర΄ోగ్రామింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు.

ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
‘నా భవిష్యత్‌ చిత్రపటం’ ఇలా ఉండాలని అమన్‌ ఎప్పుడూప్లాన్‌ చేసుకోలేదు.అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారులలోకి తీసుకువెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతికరంగంలో ప్రపంచ ప్రముఖుడిని చేసింది. మొదట్లో కంపెనీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆ తరువాత మాత్రం  పోటీ ఎదురవుతుంది. ΄ోటీని ఎలా తీసుకుంటారు?’ అనే ప్రశ్నకు అమన్‌ ఇచ్చిన జవాబు... పోటీ గురించి నిరంతరం పట్టించుకుంటాం. వారి పనితీరు కూడా పరిశీలిస్తాం. పనితీరు, ఆవిష్కరణలు నచ్చితే వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మాకే అన్నీ తెలుసు అనుకోము. ఎందుకంటే మేము చేయలేనివి కూడా వారు చేసి ఉండవచ్చు.’

ఒక బాటసారి 
మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒకేచోట ఆగి΄ోదు. నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారులలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి ఒక బాటసారి అమన్‌ సాంగర్‌. వీడియో గేమ్స్‌ కంటే ఎక్కువగా కోడింగ్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టం అతడిని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్‌ వ్యాలీ వరకు తీసుకువెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. పోటీలో మన ముందు ఉన్న వ్యక్తిని చూసి భయపడవద్దు. వెనక్కి తగ్గవద్దు. మన కంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ΄ోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు’ అంటున్నాడు అమన్‌ సాంగర్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)