Breaking News

Mumbai Dating Scam: అమ్మాయిలనే ఎరగా వేసి.. యువతకు బురిడి

Published on Sat, 08/24/2024 - 14:32

డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను కొందరు కిలేడీలు ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఘటనలు జరుగుతున్నాయి. అమాయకుల ఆశనే అసరాగా తీసుకుని.. మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. మ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోవెలుగుచూసింది. 

డేటింగ్ యాప్ స్కామ్‌ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని గాడ్‌ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. పలు డేటింగ్ యాప్‌ల ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు.

 అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్‌కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. మద్యం హుక్కా, ఖరీదైన ఫుడ్‌ ఆర్డర్‌చేస్తుంది. ఆర్డర్‌లు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ యువతులు మధ్యలో జారుకుంటారు

ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి రూ.61, 743 వరకు బిల్లులు కట్టారు. ఒకవేళ బిల్లు కట్టని వారిని క్లబ్‌ సిబ్బంది, బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీంతో భయం, అవమానంతో బిల్లు కట్టేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది.  

 ఇలా గాడ్‌ఫాదర్ క్లబ్ మాత్రమే కాదు ముంబైలో పలు క్లబ్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత  క్లబ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా ఈ సంస్థలు పీఆర్‌ సిబ్బందిని నియమించుకుంటాయి. వారు డేటింగ్ యాప్‌లలో పురుషులను ఎర వేయడానికి యువతులను నియమించుకుంటారు. అబ్బాయిలను ముగ్గులోకి దింపేందుకు ఖరీదైన వస్తువులు లేదా, వ్యక్తిగత ఫోటోలతో ఎరవేస్తారు. 

అయితే  ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. జూన్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం విదితమే.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)