Breaking News

శబరిమలలో భక్తుల రద్దీ..! ఏకంగా పంబా నది వరకు..

Published on Mon, 01/05/2026 - 11:59

బరిమల ఆలయంలో ప్రస్తుతం (జనవరి 2026 మొదటి వారంలో) మకరవిళక్కు తీర్థయాత్ర సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు, దీంతో నిర్వహణ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు సుమారు 70,000 నుంచి 90,000 మందికి పైగా భక్తులను నియంత్రిస్తున్నారు. 

అయినప్పటికీ రద్దీ, వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంది. మరోవైపు భక్తుల కిటకిటలతో శబరిమల (Sabarimala) కొండలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దర్శన క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. సన్నిధానం (ఆలయం) నుంచి మొదలైన క్యూలైన్లు కొండ కింద ఉన్న పంబా నది (Pamba River) వరకు చేరుకోవడం అక్కడి రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. 

దేవస్వం బోర్డు కూడా ఈ రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని నియమించి.. క్యూ కాంప్లెక్స్‌లలో విశ్రాంతి సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు స్వామి దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు.

(చదవండి: ఇవాళ నుంచే అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం..!)

Videos

జనగామ చౌరస్తాలో ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ నిరసన

ABN ఛానల్ పై ఫిర్యాదు.. డిబేట్లు లిమిట్స్ దాటుతున్నాయి: YSRCP Leaders

Sajjala : కోడి కోశారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు

Komatireddy: వాళ్లను దేవుడే శిక్షిస్తాడు.. నాకు తెలియకుండానే టికెట్ రేట్లు పెంచారు

అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్...TDP వాళ్లే ఛీ కొడుతున్నారు

Addanki Ashok: ఇది రెండో సంక్రాంతి.. ఆ హామీ ఎక్కడ? YSRCP నిరసన

Sankranti Celebrations: పల్లె బాట పట్టిన హైదరాబాద్ వాసులు

Hyd: రోడ్డుపై డేంజరస్ స్టంట్స్..!

Kakani: హౌస్ అరెస్ట్ మా ప్రాణాలు బ అర్పించడానికైనా సిద్ధం

Sajjala : రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు విఫలమయ్యారు

Photos

+5

తిరుమలలో సినీ నటులు తనికెళ్ల భరణి (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన.. ఆషికా, డింపుల్‌ (ఫొటోలు)

+5

'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)

+5

క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)

+5

ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)

+5

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)

+5

తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)