Breaking News

కూరగాయలు కుళ్లినా వంట చేయాలి

Published on Thu, 11/05/2026 - 10:58

కర్ణాటక: ఎన్నో ఆశలతో అత్తింట కాలుమోపిన వివాహితకు నిత్యం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాయనహళ్లి గ్రామంలో చోటుచేసుకొంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఆరు నెలల కిందట బెంగళూరు కెఆర్‌ పురం బిదరెహల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కుమార్తె ప్రతిభ(26)ను చింతామణి తాలూకా నాయనహళ్లి గ్రామానికి చెందని బచ్చనగారి కృష్ణారెడ్డి కొడుకు రఘుకు ఇచ్చి వివాహం చేశారు. 

అయితే రోజూ ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. రోజూ ఉదయం మాత్రమే వంట చేయాలి. మధ్యాహ్నం, రాత్రి ఆ వంటలనే ఆరగించాలి. కూరగాయలు కుళ్లిపోయినా వాటితోనే వంటలు చేయాలి. ఇలా రకరకాలుగా వేధించారు. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి. ఈ వేధింపులు తాళలేక  ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ పద్మిని సాహో, డీఎస్పీ రఘు, తహసీల్దార్‌ సుదర్శన్‌ యాదవ్‌ ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త రఘును పోలీసులు ఆరెస్టు చేశారు.

ఇదీ చదవండి: పాల ధరల పెంపు.. 35 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు!


 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)