Breaking News

భార్యకు భర్త యజమాని కాడు!

Published on Tue, 03/25/2025 - 07:05

ప్రయాగ్‌రాజ్‌: భార్య తనతో ఉన్న ఇంటిమేట్‌ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్‌ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

‘ఇంటిమేటెడ్‌ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్‌ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. 

ఈ నమ్మక ద్రోహం వైవాహిక 
బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్‌ వినోద్‌ దివాకర్‌ వ్యాఖ్యానించారు.  భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు.  తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్‌లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్‌ జిల్లాలో ప్రద్యుమ్న్‌ యాదవ్‌ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. 

తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్‌ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)