Breaking News

ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టు అనంత్‌ టీమ్‌

Published on Sat, 11/29/2025 - 04:21

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయుధాలు విడిచి జనవరి 1న లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎంసీ (మహారాష్ట్ర –మధ్యప్రదేశ్‌–ఛత్తీస్‌గఢ్‌) జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరుతో గురువారం రాత్రి విడుదల చేసిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచి్చంది. కాల్పుల విరమణపై ప్రతిపాదన చేస్తూ ఇటీవలే అనంత్‌ లేఖ విడుదల చేయగా.. తాజా లేఖలో ఏకంగా కాల్పుల విరమణ తేదీ ప్రకటనతోపాటు ఉమ్మడిగా తాము లొంగిపోయేందుకు సిద్ధమన్న కీలక నిర్ణయాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణుదేవ్‌ సాయ్, మోహన్‌ యాదవ్‌లను ఉద్దేశించి రాసిన రెండు పేజీల లేఖలో అనంత్‌ పలు అంశాలను ప్రస్తావించారు. అయితే, లేఖ విడుదల చేసిన మరుసటి రోజే అనంత్‌ టీమ్‌ లొంగిపోవడం గమనార్హం. 

అప్పటి వరకు సంయమనం పాటించాలి 
‘కామ్రేడ్స్, 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుని, ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వం ఇచ్చే పునరావాసాన్ని అంగీకరించడం ద్వారా జన జీవన స్రవంతిలోకి చేరతాం. అప్పటివరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అభ్యరి్థస్తున్నాం. జోన్‌లో ఎక్కడా    భద్రతా దళాలు అరెస్టులు లేదా ఎన్‌కౌంటర్‌ వంటి వాటికి పాల్పడకూడదు. అదే సమయంలో జోన్‌ అంతటా చెల్లాచెదురుగా ఉన్న మా సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం ప్రయతి్నస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో సతీశ్‌ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా, మేము మా ఆయుధాలను ఈ మూడు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రికి లేదా హోంమంత్రికి అప్పగించి, ప్రధాన స్రవంతిలో చేరాలనుకుంటున్నాం. 

వచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో మద్దతును అందించే రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆయుధాలను అప్పగించాలనుకుంటున్నాం. ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నా. భద్రతా దళాలు ఆ తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేసి ఎన్‌కౌంటర్‌ వంటి ఘటనలకు పాల్పడకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ సుఖాంతమయ్యే వరకు మన సహచరులందరూ తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి. కామ్రేడ్‌లందరూ బహిరంగంగా సంప్రదించడానికి నేను బావోఫెంగ్‌ ఓపెన్‌ ఫ్రీక్వెన్సీ (నంబర్‌) 435.715ను జారీ చేస్తున్నాను. వచ్చే నెల రోజులు రోజూ ఉదయం 11 నుంచి 11:15 గంటల మధ్య ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు తమ సహకారాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. సోను దాదా, సతీశ్‌ దాదా కూడా మా ఆందోళనలను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయాలని, వారి పూర్తి మద్దతును ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’అని అనంత్‌ లేఖలో పేర్కొన్నారు. 



మహరాష్ట్రలో లొంగుబాటు 
అజ్ఞాత జీవితం వదిలేస్తామని వరుసగా లేఖలు జారీ చేస్తూ వచి్చన ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ శుక్రవారం లొంగిపోయింది. ఎంఎంసీ అధికార ప్రతినిధి అనంత్‌తోపాటు మరో 11మంది మావోయిస్టులు మహారాష్ట్రలో అడవిని వీడారు. అక్కడే వారి కోసం వేచి ఉన్న ఓ మీడియా ప్రతినిధి ద్వారా మహారాష్ట్రకు చెందిన పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడారు. లొంగుబాటు ప్రక్రియ సాఫీగా జరుగుతుందని సదరు అధికారి హామీ ఇచ్చాక వారు అడవి నుంచి మైదానం వైపు నడక ప్రారంభించారు. అనంతరం వారు గోండియా పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిర్బంధం పెరగడంతోనే అడవిని వీడాల్సి వస్తోందని అనంత్‌ చెప్పారు. హిడ్మా తర్వాత ఛత్తీస్‌గఢ్‌ నుంచి సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఎదిగిన రణ్‌«దీర్‌ ఇంకా అడవిలోనే ఉన్నాడని, వారు కూడా అజ్ఞాతం వీడాలని అనంత్‌ కోరారు. కాగా ఎంఎంసీకి ఇన్‌చార్జిగా ఉన్న అనంత్‌ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బత్తుల కాశీరామ్‌ అనే వ్యక్తి అనంత్‌ పేరుతో పార్టీలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)