Breaking News

Manipur violence: మణిపూర్‌ కేసులు అస్సాంకు

Published on Sat, 08/26/2023 - 04:33

న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు చేస్తున్న మణిపూర్‌ హింసాకాండ కేసులను అస్సాంకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఒకరిద్దరు న్యాయాధికారులను నియమించాల్సిదిగా గౌహతి హైకోర్టు ను నిర్దేశించింది. ఈ మేరకు ఇంకా పలు ఇతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులు ఇందులో ఉన్నాయి.

ఈ దశలో అన్ని పరిస్థితులను దృష్టిలో  ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ పార్డివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. సీబీఐ ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను తోసిపుచి్చంది.

కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన అభ్యర్థనను ఆమోదించింది. ‘ ప్రధానంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అస్సాంలో అది చాలా ఎక్కువగా ఉంది‘ అని పేర్కొంది. ‘ కుకీలు, మైతీలు రెండు తెగల వారూ ఎంతో నష్టపోయారు. కొండల్లో, లోయల్లో, అంతటా బాధితులు ఉన్నారు. అందుకే ఇరు వర్గాలకూ న్యాయంగా ఉండేలా తర్వాత అదేశాలిస్తాం‘ అని
వివరించింది.

మణిపూర్‌ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన పలు ఆదేశాలు...
► బాధితులు, సాక్షులను కోర్టుకు పిలవకుండా వీడియో కాన్ఫరెన్స్‌ తదితర మార్గాల్లో వర్చువల్‌గా విచారించాలి.
► ఫస్ట్‌ క్లాస్‌ లేదా గౌహతి, అస్సాం సెషన్స్‌ కోర్టులో పని చేస్తున్న ఒకరు, లేదా ఇద్దరు జ్యుడీíÙయల్‌ మేజి్రస్టేట్లను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్‌ చేయాలి.
► వారు మణిపూర్‌లో మాట్లాడే ఒకటి రెండు భాషలు తెలిసిన వారైతే మంచిది.
► నిందితుల హాజరు, రిమాండ్, కస్టడీ, దాని పొడిగింపు వంటి విచారణ ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లో జరిపేందుకు అనుమతి.
► దూరం, భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం.
► ప్రయాణ సమస్య కారణంగా నిందితులకు మణిపూర్‌ లోనే జ్యుడీíÙయల్‌ కస్టడీకి అనుమతి
► స్టేట్‌మెంట్‌ నమోదు తదితరాల కోసం మణిపూర్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఒకరు, లేదా ఇద్దరు మేజిస్ట్రేట్‌లను నియమించాలి.
► దోషుల గుర్తింపు పరేడ్‌లు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపేందుకు అనుమతి.
► సోదాలు, అరెస్ట్‌ వారెంట్‌లను కూడా ఆన్‌లైన్‌లో జారీ చేయొచ్చు.
► జస్టిస్‌ గీత మిట్టల్, సారథ్యంలోని ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ప్యానల్‌ సజావుగా పని చేసేందుకు అనువైన ఆదేశాలను సెపె్టంబర్‌ 1న ఇస్తారు. 

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)