Breaking News

అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్‌’.. అభ్యంతరం చెప్పడంతో..

Published on Wed, 06/25/2025 - 10:03

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు క్షణికావేశంతో బలవన్మరణాలకు లేదా అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక యువతి తనను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ యువతిని కడతేర్చాడు.

ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతికి మరణానికి కారకుడైన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తౌఫిక్‌గా గుర్తించిన పోలీసులు.. అతనిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండాలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తౌఫిక్ ముందుగా బుర్ఖా ధరించి.. తాను ఎంతగానో ఇష్టపడిన నేహా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడేవున్న నేహా తండ్రిని  పక్కకు నెట్టేసి నేరుగా టెర్రస్ వద్దకు  చేరుకున్నాడు.  ఆ సమయంలో నేహా అక్కడ వాటర్ ట్యాంక్‌ను పరిశీలిస్తోంది.

అతనిని నేహా గమనించింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.  ఆగ్రహంతో తౌఫిక్ ఆమెను ఐదవ అంతస్తు నుంచి తోసివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన నేహాను వెంటనే జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స  పొందుతూ, ఆమె మృతిచెందింది.  కాగా నేహా అతనిని సోదరునిగా భావించిందని, అయినా అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.

తౌఫిక్ మూడేళ్లుగా తమను తెలుసని, నేహా అతనిని సోదరునిలా చూసుకున్నదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.  అయితే గతకొంతకాలంగా అతను నేహాను వివాహం చేసుకోవాలని భావిస్తూ, ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే నేహా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. తౌఫిక్  తన సోదరిని  నెల్లాళ్లుగా పెళ్లి చేసుకోవాలని  వేధిస్తున్నాడని నేహా సోదరి మీడియాకు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో  నివాసం ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌ కేసు’లో బిగ్‌ ట్విస్ట్‌.. సోనమ్‌, రాజ్‌లు అప్పటికే..

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)